ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో జయ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ పరీక్షలో తమ పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి రెండవ లెవెల్ కు అర్హత సాధించినట్లు జిల్లా కేంద్రంలోని జయ ఐఐటి ఒలంపియాడ్ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుండి జెస్సికా నాన్సీ, రామ్ సాయి , 6వ తరగతి నుండి జయసూర్య , లాస్య , 7వ తరగతి నుండి కార్తికేయ శ్రీవాస్తవ్, శృతిప్రియ , 8వ తరగతి నుండి మనస్విని, హాసిని , 9వ తరగతి నుండి నేహాసాయి, శివరక్షిత రెండవ లెవెల్ కు అర్హత సాధించారని అన్నారు. ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులను, ఈ ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు.తమ యొక్క అత్యుత్తమ ప్రోగ్రామ్ ద్వారా ఇటువంటి విజయాలను సాధిస్తున్నట్లు తెలిపారు.తమపై విశ్వాసంతో అన్ని విధాలుగా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులను అభినందించిన వారిలో పాఠశాల డైరెక్టర్లు జెల్లా పద్మ , బింగి జ్యోతి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.




