Wednesday, 4 November 2026

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్
జహీరాబాద్ డిసెంబర్ 28 (జనం సాక్షి): న్యాల్కల్ మండల కేంద్రంలోని ‘హజరత్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా’ క్రికెట్ టోర్నమెంట్ ను మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ తో కలిసి ప్రారంభించిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్.ఈ సందర్భంగా స్వప్నభాస్కర్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం చాలా అభినందనీయం అనీ తెలుపుతూ,క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయి అని తెలిపారు.అదేవిధంగా గెలుపు,ఓటములు ఆటలో సహజం అనీ,అందరు స్నేహపూర్వక వాతావరణంలో ఆడాలని,క్రీడాలను ప్రోత్సహిస్తున్న మైనార్టీ నాయకులు మహమ్మద్ షకీల్,ఎంపీటీసీ దేశెట్టి పాటిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ వినయ్ కుమార్,సర్పంచ్ శివస్వామి,ఉపసర్పంచ్ ఖాదర్,మండల నాయకులు రాజేందర్ రెడ్డి,ఆత్మ డైరెక్టర్ రాజు,మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ మఖ్సూద్,సంగమేష్,సంజీవ్,ప్రవీణ్, వసీమ్,శివరాజ్,ఖలీల్,నిర్వాహకులు ముస్తఫా,ముస్తక్,అజార్,నవీన్,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు