Wednesday, 4 November 2026

ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలికొన్న ర్యాగింగ్‌

ముంబయి, జనంసాక్షి: నవీ ముంబయిలో రెండో ఏడాది ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒక విద్యార్థి ర్యాగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నడుస్తున్న రైలు కిందపడి అసువులు బాసిన నితిన్‌ పడల్కర్‌ తన సూయిసైట్‌ నోట్‌లో కళాశాలకు చెందిన ఇద్దరు సీనియర్‌ నెలల తరబడి వేధిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆ విద్యార్థులను విచారించనున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *