Monday, 2 November 2026

ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి.

 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.మే1.సికింద్రాబాద్ కళసిగూడ డ్రైనేజీ కాలువలో పడి బాలిక మృతికి కారణమైన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గుప్తా తో కలిసి సోమవారం జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో చాలామంది నాలాలో పడి కొట్టుకుపోయి మృతి చెందారని, మూడు రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ కాలువలో పడి కొట్టుకుపోయిన చిన్నారి మృతికి కారణమైన ఇంజనీరింగ్ చీఫ్,జోనల్ కమిషనర్ బాధ్యులను చేస్తూ వీరిపై చర్యలు చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరామన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారని అన్నారు.