మెట్పల్లి టౌన్, మే 01, జనంసాక్షి :మెట్పల్లి పట్టణ కేంద్రంలో సోమవారం రోజున వెల్డింగ్ మరియు ఇంజనీరింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75 వేల రూపాయలు అందించడం జరిగింది ఇటీవల సంఘ సభ్యుడు ఎండి ఉస్మాన్ మరణించడంతో అతని కుటుంబ సభ్యులకి వెల్డింగ్,ఇంజనీరింగ్ ఓనర్ అసోసియేషన్ తరపున 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా అధ్యక్షులు కొండ మురళి మాట్లాడుతూ మా అసోసియేషన్ తరఫున ఎవరైనా సంఘ సభ్యుడు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు భరోసాగా ఉంటుందని అన్నారు.ఉస్మాన్ మరణించిన సందర్భంగా వారి కుటుంబానికి 75000 వేల రూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి వారి కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని అన్నారు .
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా మురళి,ఉపాధ్యక్షులు ఎస్కే జలీల్, కార్యదర్శి జి శ్రీనివాస్, క్యాషియర్ ఎం శ్రీనివాస్, కొడిమ్యాల వెంకటస్వామి, మాలేపు రాములు,ఎంఎస్ సలీం,ఎర్రజి రవి,శ్రీ గద్దె శ్రీనివాస్,
కె గంగాధర్,ఎండి ముజాహిద్, చిన్నయ్య, దశరథం,చరణ్ సింగ్, నాగరాజు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .




