ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సామాజిక సేవలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవలు అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన సంవత్సరం 2023 డైరీని ఆ సంఘ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సామాజిక సేవలో ముందంజలో ఉందన్నారు.దివ్యాంగులకు , వృద్ధులకు చేయూతనందిస్తున్న చల్లా లక్ష్మీకాంత్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో చల్లా లక్ష్మీప్రసాద్, శ్రీశైలం, నరేష్ , ఎర్రయ్య, లక్ష్మణ్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.




