Wednesday, 4 November 2026

ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిఓఈ ముందంజ. – ద్వితీయ సంవత్సరంలో 63మందికి గాను 58 మందికి ఏ గ్రేడ్, ఐదుగురికి బి గ్రేడ్. – ప్రధమ సంవత్సరంలో 70 మందికి గాను 41 మంది ఏ గ్రేడ్, 17 మంది బి గ్రేడ్,6మంది సి గ్రేడ్. – ఏకంగా 50మంది విద్యార్ధులకు ఫిజిక్స్ లో అరవైకి అరవై (వందశాతం)మార్కులు.

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, మే 9, (జనంసాక్షి )తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ)బెల్లంపల్లి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సిలివేరు వినయ్ 969 మార్కులు, బైపీసీ విభాగంలో మల్లెపూల సాయి 954 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. బైపీసీ లో 31 మందికి 31 మంది పాసై 100% ఫలితాలు సాధించగా ఎంపీసీ లో 32 మందికి గాను 31 మంది పాసై 97% ఫలితాలు సాధించారు. మొత్తం 63 మందికి గాను 57 మంది ఏ గ్రేడ్, నలుగురు బి గ్రేడ్ సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో గొల్ల బలరాముడు 470మార్కులకు గాను 464 మార్కులు, బైపిసి విభాగంలో మూడ్ సాయికిరణ్ 440మార్కులకు గాను 410 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. మొత్తం ప్రథమ సంవత్సరంలో 70 మందికి గాను 41 మంది ఏ గ్రేడ్, 17 మంది బి గ్రేడ్, 6మంది సి గ్రేడ్ సాధించారు. ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 50మంది విద్యార్ధులు ఫిజిక్స్ లో అరవైకి అరవై (వందశాతం)మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఐనాల సైదులు కళాశాల టాపర్స్ గా నిలిచిన విద్యార్ధులను కళాశాలలో పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీరామ వర్మ, మిట్టా రమేష్, కట్ల రవీందర్, గాజుల రాజేందర్, అనుముల అనిరుద్, అకెనేపల్లి రాజేష్, మహ్మద్ రఫి, సుకరి అర్జున్, చందా లక్ష్మీనారాయణ, సిబ్బంది సమేందర్, తేజశ్వి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి ఫోన్ ద్వారా అభినందించారు.