Thursday, 5 November 2026

ఇంటర్‌లో స్టేట్‌ మూడవ జనం సాక్షి ప్రతినిధి మెదక్ ర్యాంకు సాధించిన నందిని ` జిల్లాకు రాష్ట్ర స్థాయిలో పేరుతెచ్చిన శివాయిపల్లి ఆణిముత్యం ` విద్యార్థినీని సన్మానించిన రాష్ట్ర గురుకుల పాఠశాలల మంత్రి గంగుల కమలాకర్‌

 

 

 

 

 

 

 

 

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఎంపిసీలో స్టేట్‌ మూడవ ర్యాంకు సాధించిన నందిని మెదక్‌ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకువచ్చింది. మెదక్‌ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సిహెచ్‌. వెంకటేశ్‌`నాగమణిల కుమార్తె నందిని చిన్నతనం నుండే గురుకులంలో చదువుతూ మంచి మార్కులతో జిల్లాకు పేరు తీసుకువస్తూనే ఉంది. జిల్లాలోని హవేళిఘనపూర్‌ మండల కేంద్రంలోని ఎంజీబి గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉంటూ ఆరవత తరగతి నుంచి చదువుతూ గత ఏడాది పదవ తరగతిలో కూడా పదికి పది మార్కులు సాధించి ఫస్ట్‌ ర్యాంకులో నిలిచింది. గురుకుల పాఠశాలకు మంది పేరుతేవడంతో ఉపాధ్యాయులు అభినందించారు. పై చదువు నిమిత్తం వర్గల్‌లోని ఎంజిపీ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఎంపిసీలో చేరింది. కాగా మొన్న విడుదలైన ఇంటర్మీడియట్‌ పరీక్షాఫలితాల్లో స్టేట్‌ మూడవ ర్యాంకు సాధించి జిల్లా మరోసారి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలంలో గురుకుల పాఠశాలల మంత్రి గంగుల కమలాకర్‌ విద్యార్థినీని శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేసి విద్యార్తినీ అభినందించి 10వేల రూపాయల చెక్కును అందజేశారు. అదే విధంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తానని, చలి కాలంలో గురుకుంలోని విద్యార్థునీ, విద్యార్థులకు వేడి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర గురుకులాల సెక్రటరీ మల్లయ్య బట్టు విద్యార్థిని నందినీని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులంలో చదువుకుంటూ పదవ తరగతిలో పదికి పది మార్కులు తెచ్చి మెదక్‌కు మంచి పేరు తీసుకువచ్చావని, ఇప్పుడు వర్గల్‌లో ఎంజిపీ గురుకుల కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు సాధించి గురుకులానికి మరింత పేరు తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులతో పాటు మెదక్‌కు మంచి పేరు తెచ్చావని అభినందించారు. విద్యార్థి నందినినీ సెక్రటరీ మల్లయ్య బట్టు నువ్వు ఏమవుతావని అడుగగా ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవుతానని విద్యార్థినీ పేర్కోంది. ఉన్నత చదవుల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.