వీణవంక మే 18 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి సంబంధించిన ఇటీవల పదవ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులు అందరూ 2023-24 సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజి,గన్ముకుల ఇంటర్మీడియేట్ ప్రవేశాలకు ఆధునిక గ్రామదర్శిని పాడి ఉదయ్ నందన్ రెడ్డి వారి కంప్యూటర్ సెంటర్ లో విద్యార్థుల ప్రవేశాలకు విద్యార్థులకు సంబంధించి ఆన్ లైన్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయబడును. తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కాలేజ్ యొక్క ప్రత్యేకతలు
ప్రతీ సంవత్సరం జిల్లాలోనే మొదటి స్థాయిలో నిలిచే ఫలితాలు 94%,వివిధ సంస్ధల సహకారంతో ఇంటర్మీడియేట్ నుండి ఉపాధి అవకాశాల శిక్షణ, బాలికలకు ఉచిత హాస్టల్ వసతి, పరిమిత సంఖ్యలో సీట్లు ఎంపీసీ. బైపీసి. సిఈసి . ఎం ఈ సి 40 సీట్లు ఒక్క గ్రూపుకు అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్ష వొకేషనల్ కోర్సులు ఉచితం, ప్రభుత్వం నుండి అనేక ఉచిత సౌకర్యాలు నిష్ణాతులైన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన వాతావరణం కలదు విద్యార్థులకు అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజీలో ప్రవేశం పొందాలని వారు కోరారు.




