Thursday, 5 November 2026

మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్బలంతోనే పేద ముస్లింల ఇండ్లను టార్గెట్ చేసి కూల్చారు

 

 

 

 

 

 

రేకుర్తి గుట్ట భవిష్యత్తులో పర్యాటక ప్రాంతం అవుతుందనే కారణంతో పేద ముస్లింలకిచ్చిన భూములపై భూబకాసురులు కన్నేశారు

మంత్రి కమలాకర్ భూమాఫియాను ప్రోత్సహించడాన్ని, పేద ముస్లింల ఇండ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కమలాకర్ ను మంత్రి పదవి నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించాలి

 

రాష్ట్ర ప్రభుత్వమే కూల్చిన జాగలో బాధితులకు ఇండ్లు కట్టివ్వాలి

నష్ట పరిహారంగా బాధిత కుటుంబాలకు తలా 10 లక్షలు ఇవ్వాలి..

తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని వేల దరఖాస్తులు ఇచ్చిన స్పందించని రెవెన్యూ అధికారులు.. మంత్రి ఫోన్ తో ఆగమేఘాల మీద సెలవు రోజున, నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తారా..?

ఇండ్లు కూల్చిన కబ్జా రాయుళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

సెలవు రోజున ఇండ్లు కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి

 

పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్

 

కరీంనగర్ నగరంలో రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 194 లో పలువురు పేద ముస్లింలు నిర్మించుకున్న దాదాపు 20 ఇండ్లను టార్గెట్ చేసి ఈనెల 13న శనివారం మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్బలంతో కూల్చరని తెలంగాణ పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. బుధవారం పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి నేతృత్వంలో కమిటి సభ్యులు రేకుర్తి జరీనా నగర్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, మంత్రి ఇషారాతో భూ బకాసురులు కూల్చిన ఇండ్లను పరిశీలించారు. రేకుర్తి గుట్ట భవిష్యత్ లో పర్యాటకప్రాంతం అవుతుందనే నెపంతో పేద ముస్లింలకిచ్చిన భూములపై కన్నేశారన్నారు. మంత్రి కమలాకర్ భూ మాఫియాను ప్రోత్సహించడాన్ని, ఇండ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కమలాకర్ ను, మంత్రి పదవి నుంచి, బీఆర్ఎస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని వేల దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కు ఇస్తే స్పందించని రెవెన్యూ అధికారులు, ఆఘమేఘాల మీద మంత్రి గెస్ట్ హౌజ్ లో ఉండి కలెక్టర్ కు ఫోన్ చేసి చెప్పగానే ఎలాంటి ఫిర్యాదు పత్రం లేకుండా, బాధితులకు నోటీసులు ఇవ్వకుండా పేదల ఇండ్లను కూల్చి వేయాల్సిన అవసరం ఏమోచిందన్నారు. నంబర్ ప్లేట్ లేని ఫార్చూనర్ కారులో వెళ్లి, సెలవు రోజున ఇండ్లు కూల్చిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని, కబ్జా రాయుళ్లపై సుమోటోగా కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసు కమిషనర్ కు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణ శివారులో రేకుర్తి,19వ డివిజన్ లో పేద ముస్లింలు కూలీ పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్నారు. వీరికి 20 సంవత్సరాల క్రితం షేక్ ఖాన్ కుటుంబానికి 60 చదరపు గజాల చొప్పున భూమిని నివాస స్థలాలకు ఇచ్చినాడు.వీటికి పట్టా కాగితాలు ఉన్నాయి.రెక్కాడితే గాని డొక్కాడని కడు పేదముస్లిమ్ కుటుంబాలు అవడం వల్ల, ఆస్థలం లో 20 ఏండ్ల నుండి ఇండ్లు కట్టలేకపోయారు. ఇటీవల రెండు నెలల క్రితం వారి స్థలాల్లో ఇండ్లు కట్టుకోవడం ప్రారంభించారు. గత నెల రోజుల క్రితం వీరి కాలనీ సమీపంలో ని గుట్టపైన నర్సింహా స్వామి ఆలయానికి వచ్చిన స్థానిక తెలంగాణ ప్రభుత్వ మంత్రి గంగుల కమలాకర్, ఈ ముస్లిం ఇండ్లు కట్టుకొనే స్థలాలపై వివాహస్పద వ్యాఖ్యాలు చేసి తన అనుచరులను , రత్నాకర్ రెడ్డిని పంపి 20 ముస్లిం కుటుంబీకుల స్థలాలను కబ్జా చేయడానికి గంగుల కమలాకర్ కుట్రలు పన్నాడు అందులో భాగంగానే 13 మే 2023న మధ్యాహ్నం ఒంటిగంటకు సుమారు పదిమంది వ్యక్తులు రెండు ఫార్చ్యూన్ కొత్త కార్లలో డోజర్ జెసిబి లతో ఆ ఇండ్ల వద్దకు వచ్చి కూల్చివేత ప్రారంభిస్తే యజమానులైన ముస్లిమ్లు, మహిళలు అడ్డుకొని మా ఇళ్ళను కూల్చద్దు మాకు అన్ని కాగితాలు ఉన్నాయి ఎవరు ఎందుకు కులుస్తున్నారూ అని అడ్డుకుంటే మేము గంగుల కమలాకర్ మనుషులము, మంత్రి అధికారం మాకుంది అన్ని కాగితాలు ఉన్నాయి మీకు చూపించాల్సిన అవసరం లేదంటూ ఆ 20 ఇండ్లను కూల్చి వేసినారు ఈ కూల్చివేతను పౌర హక్కుల సంఘం ,తెలంగాణ ప్రజా ఫ్రంట్ దళిత లిబరేషన్ ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తున్నాయి గంగుల కమలాకర్ కరీంనగర్లో మంత్రిగా భూ కబ్జాలు చేస్తూ మాఫియా అవతారం ఎత్తి తన అనుచరులతోటి ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ భూములు కొల్లగొడుతూ పేద ముస్లిం మహిళల తో పాటు మిగతా వారి ఇండ్లు కూల్చడాన్ని కేవలం తన మంత్రి హోదానే కాకుండా కెసిఆర్ ఇస్తున్న అధికార బలంతోనే గంగుల కమలాకర్ ఈ ముస్లింల ఇళ్లను కూల్చి వేసినాడు కరీంనగర్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు గంగుల కమలాకర్ కనుసన్నల్లో ఒక మాఫియా అవతారం ఎత్తి భూ కబ్జాలు సెటిల్ బెంటులు చేస్తూ విచ్చలవిడి దాడులు అక్రమ కేసులతో కరీంనగర్ను గత భూస్వాముల కాలాన్ని మించి దౌర్జన్యాలు సాగిస్తున్న పరంపర లోనే ఇండ్లు కూల్చి వేసినారు నిజానికి 60 గజాల ఇండ్లకు ఎలాంటి పర్మిషన్లు లేనప్పటికీని కేవలం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలయినందునే పోలీసులతోటి బెదిరించడం తన అనుచరులతోటి బెదిరించడం బరితెగిచ్చి ఇల్లు కూల్చివేయడం సరికాదు ఇప్పటికైనా కెసిఆర్ తక్షణమే స్పందించి కూల్చబడ్డ 20 ముస్లిం కుటుంబాల ఇండ్ల స్థానంలో ఇల్లు కట్టియాలని, నష్టపరిహారంగా ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. కరీంనగర్లో వివిధ కాలనీలలో భూ కబ్జాలు సెటిల్మెంట్లకు పాల్పడుతున్న టిఆర్ఎస్ కార్పొరేట్లను, నాయకులను కట్టేడి చేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని పౌర హక్కుల సంఘం మరొక్కసారి తెలియజేస్తుంది. ఈనిజానిర్దారణ లో మాదన కుమారస్వామి, శ్రీపతి రాజగోపాల్, అధ్యక్షుడు, పౌర హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ, నారవినోద్ ఉపాధ్యక్షుడు పౌర హక్కుల సంఘం, బొడ్డుపెళ్లి రవి జిల్లా సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం, గడ్డం సంజీవ్ కుమార్,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,
మోటపలుకుల వెంకట్ ఈసీ మెంబర్, గుమ్మడి కొమురయ్య కన్వీనర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి, మార్వాడీ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ, బాధిత కుటుంబాల ప్రజలు ఉన్నారు.