Wednesday, 4 November 2026

ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి

 

నల్గొండ బ్యూరో, జనం సాక్షి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ప్రారంభం అయ్యాయి.నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి తనిఖీ చేశారు.విద్యార్థుల హాజరు శాతం, పరీక్షా సరళిని కలెక్టర్ పరిశీలించారు.