సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సూర్యాపేటకు చెందిన ఏనుగు అభినవి, 465 మార్కులు సాధించిన నందమూరి మేఘనను జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ యాజమాన్యం అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొండా సతీష్ మాట్లాడుతూ హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ లో 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న అభినవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందడం తమ పాఠశాలకే గర్వకారణమన్నారు.అలాగే నందమూరి మేఘన 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు తమ పాఠశాలలోనే చదువుకొని 465 మార్కులు సాధించడం అభినందనీయమన్నారు.తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎనిమిది మంది 450 మార్కులపైగా సాధించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, కృష్ణ , పూర్ణచందర్, గౌస్ , జనార్ధన్, మాధవి, అపర్ణ, శైలజ, వీణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.




