రామకృష్ణాపూర్ (జనంసాక్షి) :పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిల్ పేట్ గ్రామ నివాసి ఆకుల శ్రీనివాస్ తన కుటుంబంతో సహా మంచిర్యాల లోని చెన్నై షాపింగ్ మాల్ కు వెళ్లి పదివేల రూపాయల విలువ చేసే పెళ్లి బట్టలు కొనుగోలు చేసి, తిరుగు ప్రయాణం లో రామకృష్ణాపూర్ నకు చెందిన ఆటోలో మంచిర్యాలలో ఎక్కి, రామకృష్ణాపూర్ నకు వచ్చి పెళ్లి బట్టలు ఆటోలోనే మర్చిపోయి దిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ నకు వచ్చి జరిగిన విషయం ఎస్ ఐ.ఫరీద్ తెలపగా వెంటనే సి సి కెమెరా సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అజయ్ ను అప్రమత్తం చెయ్యగా, వారు సీసి కెమెరా ఫుటేజ్ పరిశీలించి ఆటో నెంబర్ ఆధారంగా సదరు ఆటో డ్రైవర్ మేకల సదానందంను అతని ఆటోతో సహా పిలిపించి, ఆటోలో శ్రీనివాస్ మర్చిపోయిన పెళ్లి బట్టలను ఎస్ ఐ ఫరీద్ బాధితునికి అప్పగించారు. దానితో బాధితుడు శ్రీనివాస్ రామకృష్ణాపూర్ పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్ ఐ ఫరీద్ మాట్లాడుతూ సిసి కెమెరాల వలన త్వరతగతిన బాధితులకు న్యాయం జరిగేలా చూడవచ్చని, ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలు,
వ్యాపారులు సిసి-కెమెరాలను సాధ్యమైనంత త్వరగా తమ ప్రదేశాలలో అమర్చుకొని, పోలీస్ వారికి సహకరించగలరనికోరారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ. నూనె శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్లు అజయ్, సత్తన్న, ప్రసాద్, నర్సన్న, కానిస్టేబుల్లు ఓంకార్, సునీల్, తదితరులు ఉన్నారు.




