హుజూర్ నగర్ ఏప్రిల్ 28 (జనం సాక్షి): హైదరాబాద్ లోని తెలంగాభవన్ లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానని, మరిన్ని నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరడం జరిగిందన్నారు.




