Wednesday, 4 November 2026

ఇంటింటికి తిరిగి పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి, జూన్ 16, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని 19వ వార్డులో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటింటికి తిరిగి ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, పేదలు ప్రభుత్వ, సింగరేణి భూముల్లో నివాసం ఉన్నప్పటికీ వారికి పట్టాలు లేకపోవడంతో వారి కలలను నిజం చేసిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్ కొమ్ముల సురేష్, నాయకులు జక్కుల శ్రీధర్, ఖలీం, కిరణ్, మౌనిక్, రాకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.