Wednesday, 4 November 2026

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షిపొలం దున్నటానికి వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కేసారం గ్రామానికి చెందిన గుజ్జరి సుధాకర్ 28 అదే గ్రామానికి చెందిన గుజ్జరి మహిపాల్ కు చెందిన డాక్టర్ నడిపేవాడు రోజు మాదిరిగానే గురువారం కూడా అదే గ్రామానికి చెందిన ఆనందం పొలంలో దుక్కి దున్నడానికి వెళ్ళాడు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు గుజ్జరి సుధాకర్ సదాశివపేట ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందాడు మృతుని భార్య గుజ్జరి అనిత ఫిర్యాదు మేరకు మోమిన్ పేట ఎస్సై విజయ ప్రకాష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు