బోథ్ (జనంసాక్షి) బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. శనివారం నిర్మల్ నుండి వస్తుండగా నేరడిగొండ కొరిటికల్ వద్ద జాతీయ రహదారి పై మూలమలుపు వద్ద ఆవు అడ్డు రావడంతో వాహనం ప్రమాద బారిన పడగా వాహనం ముందరి భాగం పూర్తిగా దెబ్బతింది. కాగా ఎమ్మెల్యే ఈ ప్రమాద బారిన పడినప్పటికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయట పడ్డారు. దీంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న బోథ్ బీఆర్ఎస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి నుండి ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని ఎమ్మెల్యే బాపూరావు ను కలిశారు.
ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం




