మోత్కూరు ఏప్రిల్ 20 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ లో ఇంటింటికి బిజెపి గడపగడపకు బిజెపి కార్యక్రమం గురువారం తుంగతుర్తి బిజెపి ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య ప్రారంభించారు. ప్రతి ఇంటికి ప్రధాని మోడీ సంక్షేమ పథకాల కరపత్రంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ ప్రజలతో మమేకమవుతున్న తుంగతుర్తి బిజెపి ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా బొట్టు అబ్బయ్య, సీనియర్ నాయకులు నాగార్జున రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు బయ్యని రాజు, మోత్కూర్ రూరల్ ఇన్చార్జి గౌరు శ్రీనివాస్, తుంగతుర్తి కోకన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు, తిరుమలగిరి మున్సిపాలిటీ అధ్యక్షులు వేల్పుల బంగారురాజు, కౌన్సిలర్ హనుమంతు,మేడబోయిన యాదగిరి,నాయకులు ఆరే శ్రీనివాస్, సజ్జన మనోహర్,మామిడాల యాకేష్,మన్నె శ్రీనివాస్ ఎడ్ల రాము,మరాటి అంజయ్య, చేపూరు మల్లేష్, నల్ల మాసిరెడ్డి,బాలెంల మల్లయ్య, తిరుమలేష్, ప్రశాంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




