మిర్యాలగూడ, జనం సాక్షి. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎమ్మెల్యే భాస్కర్ రావు విశేష కృషి చేస్తున్నారని ఎన్ బి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్ధార్థ పేర్కొన్నారు. గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ మాట్లాడుతూ పేద ముస్లిం సోదరులకు చేయూత ఇవ్వాలని ముస్లిం మైనార్టీ బిఆర్ఎస్ కౌన్సిలర్లు, చైర్మన్ తో కలిసి ఎమ్మెల్యే భాస్కర్ రావును కలవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి పేద ముస్లింలు రంజాన్ పండుగను సరిగా చేసుకోలేకపోయారని తమరు పేద ముస్లింలకు ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భాస్క ర్ రావు రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింల అందరికీ రంజాన్ తోఫా ద్వారా తమ వంతు చేయూత అందించడంతోపాటు, ముస్లిమ్స్ సోదరులు రంజాన్ ని ఘనంగా జరుపుకునేందుకు తోఫాలను ప్రతి గడప గడపకు అందించాలని కోరడం జరిగిందన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ సుమారు 800 రంజాన్ తోఫాలను ఇంటింటికి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు వార్డు ఇన్చార్జులు స్వయంగా వెళ్లి ముస్లిం సోదరులకు తోఫాలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిర్యాలగూడలో మతసామరస్యాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతంగా వారి అభివృద్ధి సంక్షేమానికి ఎమ్మెల్యే భాస్కర్ రావు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రంజాన్ మాసం ఉపవాస దీక్షలలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఇలియాస్, జావిద్, సలీం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దూం, ముస్లిం మైనార్టీ నాయకులు మజీద్, ఖాజా మొయినుద్దీన్, మదర్ బాబా, పహిముద్దీన్, జానీ, చాంద్ పాషా, రెహమాన్ ఖాన్, హబీబ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే భాస్కర్ రావు నిరంతరం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేద ముస్లింలకు తన వంతు చేయూతనందించేందుకు ఎమ్మెల్యే భాస్కర్ రావు రంజాన్ తోఫాలను ప్రతి ఇంటికి అందించినందుకు ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.




