నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73 వ జన్మదిన వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఎస్సీ కాంప్లెక్స్ ముందు చంద్రబాబు నాయుడు చిత్రపటం ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా రమేశ్ కొప్పుల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు.చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నేత అని బడుగు బాలహీనవర్గాల నాయకుడని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్ ను ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడే అని అన్నారు.హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించడం,జన్మభూమి,శ్రమదానం,క్లీన్ అండ్ గ్రీన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు.సాఫ్టవేర్ రంగంలో అత్యదిక వేతనాలతో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.ఇవే కాకుండా రింగ్ రోడ్డు , శంషాబాద్ అంటార్జాతీయ ఎయిర్ పోర్ట్,జీనం వ్యాలీ, మెక్రో సాప్ట్, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టేలు చేపట్టి తెలంగాణ ను అభివృద్ధి లో దేశంలో ముందు వరుసలో ఉంచారని అన్నారు.ఎన్నో పాలన సంస్కరణలు చేసి దేశంలో నే ఉత్తమ ముఖ్యమంత్రి గా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కి దక్కుతుందని అన్నారు.ఆయనతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యపడుతుందని, నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆదర్శవంతమైన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందారన్నారు.రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సహాయ కార్యదర్శి డి బాలకృష్ణ జిల్లా మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాఫర్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాము జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ శివ నాగరాజు వనపట్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.




