Thursday, 5 November 2026

34 కోట్ల తో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

 

జనం సాక్షి నర్సంపేటనర్సంపేట నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి 34 కోట్లు క్రిటికల్ కేర్ యూనిటు మంజూరు చేసిన నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విలేకరు సమావేశంలో తెలిపారుఅనంతరం ఆయన మాట్లాడుతూమరో మూడు నెలల్లో సిద్ధంగా ఉన్న 250 పడకలహాస్పిటల్. ప్రారంభించుకుంటున్నామని ఆయన అన్నారు అదేవిధంగా ఆరోగ్య శాఖ నుండి కోట్ల రూపాయలతో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని నిధులు నర్సంపేట కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు పల్లె దావ కన 49 మంజూరు చేసినట్టు కొన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు పట్టణ అభివృద్ధి క్రింద నిధులు మంజూరు అయ్యాయని మిషన్ భగీరథ కింద పైపులైను ద్వారా వాటర్ సప్లై చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారుఅదే విధంగా భాజపా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పధకాలను వక్రీకరించి మాట్లాడిన వాఖ్యలను తీవ్రంగా ఖండించి నారు2014వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల పంటలకు మద్దతు ధరను డబుల్ పెంచుతామని మాట్లాడిన మోదీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీని నీరుగార్చి మద్దతు ధరల్లో కొంతమేరకు మాత్రమే పెంచే అదే ధరను దేశ వ్యాప్తంగా అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు.ఉదాహరణకు ఒక్క వరి పంటకు సంబంధించి దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో సాగు పెట్టుబడి వ్యయంలో చాలా తేడాలుంటాయి.అలాంటప్పుడు దేశమంతా ఒకే రకమైన మద్దతు ధర రైతుకు అంతగా న్యాయం చూకూర్చేదేమి కాదని అన్నారు.రాష్ట్రాల వారీగా పెట్టుబడికి వచ్చే ఖర్చును బట్టి మద్దతు ధరను పెంచాలని తెలియజేసారు.ఏనాడు రైతు పక్షపాతిగా ఆలోచన చేయని భాజపా సర్కార్ కు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.నల్ల చట్టాలతో రైతుల గోస పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం అదే రైతుల స్వలాభాల గూర్చి మాట్లాడటం విడ్డూరం అని హితవు పలికారు.భాజపా పార్టీలో పై స్థాయి నుండి క్రింది స్థాయి వరకు నాయకులంతా పచ్చి అబద్దాలతో పబ్బం గడుపుతూ చౌకబారు విమర్శలు చేస్తున్నారు అసత్య ప్రచారాలతో ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తే బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు బిజెపి పార్టీ డిజిల్ పెట్రోల్ పెంచి గ్యాస్ ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి . రవీందర్ రెడ్డి. గుంటి కిషన్. యువరాజ్ .నల్ల భారతి. దార్ల రమాదేవి. తిరుపతి . తదితరులు పాల్గొన్నారు