ఇంటింటికి సిపిఐ పాదయాత్ర.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 1, (జనంసాక్షి )
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికి సిపిఐ పాదయాత్ర శుక్రవారం నాటికీ 51 రోజులకు చేరుకుంది. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి రేగుంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేపట్టి బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదల పార్టీ అయిన సిపిఐ పార్టీని రానున్న ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజా సమస్యలపై ఆందోళనలకు సిద్ధం అని రేగుంట చంద్రశేఖర్ అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.