పేద వర్గాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం

జనం సాక్షి , కమాన్ పూర్: పేద వర్గాలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన బుట్టి రాజమ్మ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహయ నిధికి సిఫార్సు చేసుకోగా, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బుట్టి రాజమ్మకు 60.000 /- రూ మంజూరు కాగా ఇట్టి సిఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఎంపిటిసి గొడిశెల ఉమా – సంపత్, పెంచికల్ పేట్ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎద్దు రాజయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనవేన నర్సయ్య, ఐట్ల పవన్ కళ్యాణ్, పిడిగు ఓదెలు, పిడుగు శ్రీనివాస్, ఇరుగురాల నారాయణ, సిద్దే వెంకటేష్, లింగాల నర్సయ్య, దాసరి మోగిలి, డబ్బేట తిరుపతి, సాగర్ల లక్ష్మణ్, ఇరుగురాల రమేష్, ఇటవేన చిన్న ఐలయ్య, పల్లెర్ల మురళి, కుమ్మరి రమేష్, అనవేన సతీశ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు