రుద్రుర్ (జనంసాక్షి):కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని విజయాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ మరో ముందడుగు వేసింది. ప్రధాని ప్రజలకు చేసిన సేవలను వివరించి మరోసారి దీవించాలని, ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అందులో భాగంగా రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో బీజేపీ 9 ఏండ్ల సుపరి పరిపాలన సందర్బంగా ప్రతి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ అలాగే రాష్ట్ర బిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజల కు వాగ్దానాలు చెప్పి మరిచిపోయిన విషయాలు కూడ ప్రజలకు చెప్పడం జరిగిందని మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు గజేందర్ హరికృష్ణబీసీ మోర్చా అధ్యక్షులు సాయినాథ్, వినోద్ కుమార్
శంకర్ పటేల్, రాములు, పోశెట్టి, రాజేష్
ఇంటిఇంటికి బీజేపీ కరపత్రాలు




