Tuesday, 3 November 2026

యాడారంలో సీఎం ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మహేందర్ రెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :శనివారం శామీర్ మండలంలోని తుర్కపల్లి, యాడారం గ్రామంలో సిఎంఆర్ క్రికెట్ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో మండల పరిధిలోని దాదాపు 20 గ్రామాల యువకులు పాల్గొననున్నారు . 24 వతేది మరియు ఫైనల్ మ్యాచ్ 25 వ తేదీ తో ముగుస్తుంది. ఈ రోజు ఉదయం మొదట జరిగిన మ్యాచ్లో యాడారం పై అలియా బాద్ టీం నెగ్గింది. అదే విదంగా పక్కనే ఉన్న వర్షానికి తడిగా ఉన్న గ్రౌండ్ ను నాయకులు పరిశీలించారు. అందులో ఆట ఆడేందుకు అనూకూలంగా లేకుండా పోగా క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. సీఎం ఆర్ క్రికెట్ మచ్ ను మేడ్చల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మ్యాచ్ ను తిలకించేందుకు మురళి గౌడ్,జెడ్పీటీసీ అనితా లాలయ్య, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, శామీర్ పేట ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ మహ్మద్ జహీర్ , బిఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, నవీన్ ముదిరాజ్, అనిల్ రెడ్డి,తాడెం కుమార్, మురళీచారీ , వివిద గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
24ఎస్పీటీ -1: క్రీడాకారులతో మహేందర్ రెడ్డి