Tuesday, 3 November 2026

కేజీబీవీ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు నగదు ప్రోత్సాహం అందజేత

బోయిన్ పల్లి జూన్ 24 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 2022 -23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థినిలకు బోయిన్పల్లి మండలం అనంతపల్లికి చెందిన గంగినేని కరుణకర్ వారి కుమారుడు గంగినేని వర్షిత్ తో నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. అలాగే బోయిన్పల్లి గురుకుల పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుడ్ల పోశయ్య సైతం నగదు ప్రోత్సాహకాని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితితులలో పోటితత్వంతో చదవాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. చదువు నేర్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చదువులో ముందు ఉంటూ మంచి పేరు తీసుకురావాలని కోరారు, విద్యార్థి నిలలో ఉత్సాహం నింపేందుకే కొంత వరకు నగదు పారితోషకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థినిలు స్పందన అనుషలకు వెయ్యి 116 రూపాయలు చొప్పున సంగీత సంజన లకు 516 రూపాయలు చొప్పున గంగినేని కరుణకర్, గుడ్ల పోచయ్యలు అందజేసినట్లు తెలిపారు. ఇకనుండి ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషకాన్ని అందజేయనున్నట్లు గుడ్ల పోషయ్యా తెలిపారు.ఈకార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ పద్మ,అశోక్ ,శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఉన్నారు