బెల్లంపల్లి, మే 12, (జనంసాక్షి )పేదలకు ఇంటి పట్టాతో యాజమాన్య హక్కు వచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలు జీవో 58, 59 కింద దరఖాస్తు చేసుకోవాలని దీనికి గాను ఈనెలాఖరు వరకు గడువు ఉందని, సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి జూన్ నెలాఖరు వరకు గడువు ఉందని ఆయన వివరించారు. నియోజకవర్గ ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా – శ్రీధర్, కౌన్సిలర్ అశోక్ గౌడ్, నాయకులు గడ్డం భీమా గౌడ్, సన్నీ యాదవ్, లక్ష్మీనారాయణ, సుమంత్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




