మెట్పల్లి టౌన్, మే 12, జనంసాక్షి :మెట్పల్లి పట్టణ కేంద్రంలోని తొమ్మిదవ వార్డులోని ఉర్దూ మీడియం స్కూల్లో వార్డ్ కౌన్సిలర్ మోరపు గంగాధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 22 తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది పట్టణ ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరు.మెట్పల్లి పట్టణంలో అన్ని వార్డులలో ఈ నెల 22 తేదీన కంటి వెలుగు కార్యక్రమం ముగుస్తుందని తెలియజేశారు మెట్పల్లి పట్టణంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోరపు గంగాధర్, ముజీబ్, జగన్నాథం, పుల్లశేఖర్, డాక్టర్స్, ఏఎన్ఎం లు ఆర్ పి లు పాల్గొన్నారు




