Thursday, 5 November 2026

బండి సంజయ్ వి కారుకూతలు అవగాహన లేకుండా మాట్లాడడం అవేకానికి నిదర్శనం బండి సంజయ్‌ వ్యాఖ్యలపై బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఫైర్

 

 

 

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 12 :బండి సంజయ్‌ కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే నాలుక చీరేస్తామంటూ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కౌంటర్‌ ఎటాక్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గురువారం సంగారెడ్డిలో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సంగారెడ్డిలోని చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తొండి సంజయ్‌ ఎక్కడున్నారంటూ మండిపడ్డారు. ఉద్యమ నేత కేసీఆర్‌ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేసింది నిరుద్యోగ మార్చ్ కాదు బీజేపీ నిరుద్యోగ పదవుల మార్చ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి పట్టణంలో కాదు.. సంగారెడ్డి పక్కనే ఉన్నా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎల్ఐసి, బీడీఎల్, బిహెచ్ఇఎల్ కార్యాలయాల దగ్గర్లో చేస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెబుతుండే మీ సంగతి అన్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసి అమ్మంది మీరు కదా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ కార్మికుల భవిషత్తు చెలగాటం అడుతుంది బీజేపీ కదా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును అదాని, అంబానిలకు దొచిపెడుతుంది మోడీ ప్రభుత్వం కదా, మోడీ యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారం లోని వచ్చి.. ఉన్నా ఉద్యోగాలు తీసివేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశ సరిహద్దులో సేవ చేసే సైనికుల కూడా అగ్ని పత్ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మోడీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఆల్రెడీ ఉన్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేశారన్నారు. మోడీ, బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. సీఎం కేసిఆర్ లక్ష యాభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, వేలాది మంది కాంట్రక్టు ఉద్యోగాలను రెగ్యులర్ చేశామన్నారు. ఇంకా మిగిలి ఉన్నా ఖాళీలను నోటిికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో విద్యా వైద్యము వ్యవసాయం పరిశ్రమలో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి గంటకు నీరు అన్నదాతలను అధుకుంటున్న ప్రభుత్వం అన్నారు. బిజెపి నల్లచట్టలను తెచ్చిందని, కేటీఆర్ పరిశ్రమలు తెచ్చిండని, తెలంగాణలో బీజేపీ ఒక్క మందిరం నిర్మాణం చేయలేదని దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు డా. శ్రీహరి, పట్టణ కార్యదర్శి నర్సింలు, శ్రావణ్ రెడ్డి, హుస్సేన్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.