Tuesday, 3 November 2026

ఇంటెక్ వల్లే గని కార్మికుల కు న్యాయం! ఐ ఎన్ టి యు సి కార్యదర్శి జనక్

శనివారం హైదరాబాద్ లోని ఇంటెక్ భవన్ లో ఇంటెక్ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ నాయకత్వములో ఇంటెక్ ఎక్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యుసి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల కార్మికుల జేబీసీసీఐ బోర్డు లో ఐ ఎన్ టి యుసి లేకుండా బీజేపీ చేసిన కుట్రలకు దీటుగా హై కోర్ట్ లో కేసు వేసి జేబీసీసీఐ లో ఐ ఎన్ టి యుసి పాల్గొనే లాగ కృషి చేసి తనకు శాశ్వత వేజ్ బోర్డు మెంబర్ గా నియమించినందుకు ధన్యవాదములు తెలుపుతూ వేజ్ బోర్డు లో ఐఎన్ టి యు సి చొరవ తోనే 25 % అల్లోవన్స్ ల మీద పెంపు సాధించాం అన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి మరియు రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదల వంటి విషయాలు యూనియన్ తరపున మాట్లాడాం అని గుర్తు చేశారు.సింగరేణి లో గుర్తింపు కార్మిక సంగం ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించలేని పరిస్థితి లో యాజమాన్యం ఉంటే చట్టబద్దమైన ఐదు జాతీయ సంఘాలను,టీబి జికెఎస్ , సంఘాలను సంప్రదించే 1998 వ సంవత్సరం లోపు ఉన్న నేగోశేషన్ ప్రకారం గనులు, డిపార్టుమెంటు లు, జిఎం మరియు కార్పొరేట్ స్థాయి లలో జరిగే చర్చలకు కార్మిక ప్రతినిధులను ఆహ్వానించి పలప్రదమైన సూచనలు,సలహాలను స్వీకరించి కంపనీ మనుగడ పురోగ అభివృద్ధి కై మరియు కార్మికుల సంక్షేమం హక్కుల పరిరక్షణకు మెరుగైన పారిశ్రామిక సంబంధాల ను మెరుగు పరుచుకొనాలని యూనియన్ ప్రతినిదుల సమావేశంలో చర్చించడం జరిగింది. కేవలం ఒక ఐ ఎన్ టియుసి మాత్రమే కార్మికుల పక్షాన పోరాడుతుందని యూనియన్ కి పటిష్టమైన నాయకులు కార్యకర్తలు ఉన్నారని అన్నారు.అనంతరం ఐ ఎన్ టియుసి జాతీయ అధ్యక్షులు డా జీ సంజీవ రెడ్డి ను ఆత్మీయంగా సన్మానించి రామగుండం లో జరిగే ఐ ఎన్ టియుసి జాతీయ మహాసభలకు ఆహ్వానించారు .