Tuesday, 3 November 2026

జ్ఞానవంతమైన విద్యను అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి.

నాగర్ కర్నూల్ ఆర్సీ జూన్24(జనంసాక్షి):తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు అంతస్తుల కన్న ముఖ్యంగా జ్ఞానవంతమైన విద్యను అందించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి అన్నారు.శనివారం తిమ్మాజిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో పాటు ఎదిరెపల్లి మన ఊరు మన బడి పాఠశాలను ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సరిగా చెప్పరనే అపవాదు చాలా మంది తల్లిదండ్రుల్లో ఉందని,ప్రభుత్వ పాఠశాలల్లోనే జ్ఞానవంతమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుందని,ఇది తెలియకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తూ వేల రూపాయల ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ పాఠశాలల్లో బట్టీ చదువులు తప్ప జ్ఞానవంతమైన విద్యను అందించడం లేదుని
ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నరన్నారు.వారి కృషి ఫలి తంగానే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయన్నారు.మంచిపాఠశాలలు,విద్యాబోధన,వసతులు,మంచి ఆహారం ఉంటే విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారని చెప్పారు.ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ కరువవడంతో తల్లితండ్రులు కష్టపడి తమ పిల్లలను ప్రైవేటుకు పంపిస్తున్నారని తెలిపారు.వారి సంపాదన అంతా విద్య, వైద్యానికి ధారపోస్తున్నారని చెప్పారు.ఆ దుస్థితి నుంచి విముక్తి కల్పిస్తే ప్రజలకు ఖర్చవడంతోపాటు వారి ఆదాయం పెరుగుతుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరిగాయన్నారు
ఆరోగ్యవంతమైన,జ్ఞానవంతమైన సమాజం నిర్మాణమవుతుందని ఆలోచనతోనే తను 15కోట్లు ఖర్చు చేసి 4ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో బాగు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.ఇందులోభాగంగా సుధీర్ఘ కసరత్తు అనంతరం మన ఊరు-మన బడి కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని వెల్లడించారు.ఈ కార్యక్రమం ప్రభుత్వ బడుల మార్పునకు నాందని చెప్పారు.ప్రజలు ఆశించిన విధంగా ప్రజాప్రతినిదులు‌,పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,ప్రభుత్వ విద్యాలయాల బలోపేతం ద్వారా కార్పోరేట్ విద్యాసంస్థలకు చెక్‌పెట్టొచ్చని వెల్లడించారు.పేద,మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు.పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుందన్నారు.పాఠశాలలపై పెట్టేది ఖర్చు కాదని,పెట్టుబడి మాత్రమేనని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా గ్రామంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు,ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి,జడ్పిటిసి దయాకర్ రెడ్డి,తాహసిల్దార్ సరస్వతి,ఎంపీడీవో కరుణశ్రీ,ఆయా గ్రామాల సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.