.భువనగిరి టౌన్ (జనం సాక్షి ):– భువనగిరిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫీసును డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ భార్గవ్ ప్రొఫెసర్ గారి చే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ లో భాగంగా భువనగిరికి చెందిన పర్వతారోహ కురాలు కుమారి అన్విత రెడ్డి తన తదుపరి పర్వతమును అధిరోహించుటకు గాను జూన్ నెలలో అమెరికాకు వెళ్ళనున్నారు ఆ నేపథ్యంలో భువనగిరి ఐఎంఏ డాక్టర్స్ బృందము తనకు ఆర్థిక సహాయం అందజేసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ప్రొఫెసర్ విజయ భార్గవ్ మాట్లాడుతూ మన దేశ త్రివర్ణ పతాకాన్ని అమెరికాలోని ఎత్తైన శిఖరాలలో ఒకటి అయినా మౌంట్ అకాంకొగువా పై ఎగురవేసి మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని మా భువనగిరి ఐఎంఏ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన డాక్టర్స్




