నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-2003 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు అలనాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.20ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థులు ఒకేచోట కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, చంద్రారెడ్డి,రంగారెడ్డి, చిన్నప్ప, సువర్ణ, వెంకటరెడ్డి, శ్రీనివాస్, స్థానిక ప్రధానోపాధ్యాయులు, శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులు సతీష్,యుగంధర్, సోమిరెడ్డి, సైదులు, శ్రీకాంత్,సైదయ్య, భాస్కర్,చిరంజీవి, శేఖర్,గాంధీ,కిరణ్,రామకృష్ణ,నరేష్,సందీప్,సరిత,సునీత,సంధ్య,రేవతి, లక్ష్మీ,జనక, మదార్,రేణుక, బి,కల్యాణి,జ్యోతి, జాని బేగం,పర్వీన్,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం




