భువనగిరి టౌన్ జనం సాక్షిరమాబాయి అంబేద్కర్ గారి త్యాగం మరువలేనిదని గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.ఈరోజు మాత రమాబాయి అంబేద్కర్ గారి 88వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాలలో చదువుతున్న రోజుల్లో రమాబాయి అంబేద్కర్ గారు కూలి పనులు చేస్తూ తన పిల్లలను పోషించుకుంటు అంబేడ్కర్ గారి చదువుల ఖర్చులు పంపించేదని, చివరికి ఈదేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబెడ్కర్ గారి చదువుల కోసం తన పిల్లల ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా పస్తులు ఉంటూ డబ్బులు అంబేద్కర్ గారికి పంపేదని అంతటి త్యాగమూర్తి రమాబాయి అని అన్నారు.
ఈకార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య బోనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సురుపంగ శివలింగం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ




