భువనగిరి టౌన్ జనం సాక్షిట్రిపుల్ ఆర్ రైతులకు బేడిలు వేసిభువనగిరి పిడీఎం కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొని రావడం పై బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.తమ భూముల కోసం పోరాటం చేస్తున్న రైతులకు పోలీసులు బేడిలు వేసి కోర్టులో హాజరు పర్చడం సమంజసం కాదని, మే 30వ తేదిన భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన రైతుల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి భువనగిరి రూరల్ పోలీసులు అదే రోజు రిమాండుకు తరలించారని, ఆ రైతులను మంగళవారం రోజు భువనగిరి పిడిఎం జడ్జ్ కోర్టు లో హాజరు పర్చేందుకు రైతులకు బేడిలు వేసి మరి పోలీసులు కోర్టులో హాజరుపర్చడం అనేది రైతులను ఉద్రవాదుల లాగా పోలీసులు చూస్తున్నారని,పోలీసుల తీరుపైన బిజెపి నేత గూడూరు నారాయణ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ప్రజా స్వామ్య దేశంలో రైతులు తమ భూముల కోసం ఆందోళనలు చేస్తే దొంగతనాలు, హత్యలు చేసిన వాళ్ళ లాగా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడం హేయమైన చర్య అని బిజెపి నేత గూడూరు నారాయణ రెడ్డి గారు అన్నారు.రైతులకు బేడీలు వేసి తీసుకురావడం వల్ల వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతగానో బాధ పడ్డారని నారాయణ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. నేరగాళ్లను తీసుకుపోయినట్టు రైతులకు భేడిలు వేసి తీసుకుపోవడంతో అరెస్ట్ అయిన రైతులు సైతం కంట తడి పెట్టారని నారాయణ రెడ్డి గారు విలేకరులకు తెలిపారు..
ఉగ్రవాదుల్లగా ట్రిబుల్ ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకెళ్లడం అమానుషం::- గూడూరు నారాయణ రెడ్డి..




