వలిగొండ జనం సాక్షి న్యూసు జూన్8 మండల
పరిధిలోని రెడ్ల రేపాక దాసిరెడ్డిగూడెం గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి గాలి దుమారాలకు ఇండ్లు పైకప్పులు పూర్తిగా ధ్వంసం అవడంతో పై కప్పులు లేచిపోవడం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి హుటాహుటిన గ్రామాల కు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు పూర్తిగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు 50 వేల రూపాయలు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పత్రిక ముఖంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇస్తానని మోసం చేశారని ఎద్దేవ చేశాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నిరుపేద కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ నిర్మిస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన హితవు పలికారు రానున్న 202 4 లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినిరు పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ ఇండ్లు నిర్మిస్తామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి కంకాల కిష్టయ్య బొల్ల శ్రీనివాస్ బత్తిని లింగయ్య సహదేవ్ కాసుల వెంకన్న కొండూరు సాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశబోయిన బాలస్వామి దాసిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్ మాజీ ఎంపిటిసి గాడి పెళ్లి యాదయ్య బద్దం నరసింహ పాలోజి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డీసీసీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి




