Wednesday, 4 November 2026

భారీ వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే పైలా

వలిగొండ జనం సాక్షి న్యూస్ జూన్ 9 మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామంలో బుధవారం ఉరుముల మెరుపులతో కురిసిన భారీ వర్షానికి గాలి దుమారాలకు రేకులతో నిర్మించుకున్న ఇండ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో కప్పులు లేచిపోవడం జరిగింది ఇట్టి సమాచారము తెలుసుకున్న యాదాద్రి భువనగిరి స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గురువారము బాధితుల కుటుంబాలను పరామర్శించారు. నష్టపోయిన కుటుంబాలకు తాత్కాలిక ఆర్థిక సాయం 1,25,000 అందజేయునట్లు తెలియజేశారు ఇందులో భాగంగా హిందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి త్రిబుల్ ఆర్ ఫౌండేషన్ ద్వారా 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు జి ఎల్ ఆర్ పౌండేషన్ ద్వారా గుర్రం లక్ష్మారెడ్డి సంయుక్త 25 వేల రూపాయలు అందించనున్నట్లు వారు తెలిపారు జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో బాలురు వాష్ రూము లు స్మశాన వాటికలు కూలిపోవడంతో ఎమ్మెల్యే నిధులచే పునర్ నిర్మాణం చేయనున్నట్లు ఆయన పత్రిక ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేపాక అరుంధతి రమేష్ రెడ్డి ఎంపీటీసీ నోముల మల్లేష్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్ జిల్లా గొర్రె కాపరుల సంఘం అధ్యక్షుడు దేశబోయిన సూర్యనారాయణ సిరికొండ జాంగిర్ సందీప్ రెడ్డి రఘునాథం అశోక్ కందుల మహేష్ కొండం అశ్విని టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.