డోర్నకల్ జూన్/ 8/ జనం సాక్షి న్యూస్ :
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హున్య తండా గ్రామ పరిధిలోని బోడహట్యా తండాలో గురువారంశ్రీ సీతారామాంజనేయ స్వామి,బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహలు, ధ్వజస్తంభం ప్రతిష్టాలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొని శ్రీ సీతారామ స్వామి వారి, బొడ్రాయి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పశు సంపద పాడిపంటలతో పచ్చగా ఉండి గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి భూక్యా శ్రీను, ఉప సర్పంచ్ బోడా రమేష్, మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, కార్యకర్తలు బోడ రమేష్, రాము, బోడ రాందాస్ ,నవీన్, స్థానిక ప్రజా ప్రతినిధులు బొడ్రాయి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కనుల పండుగగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవములు




