ఇంతటి అవినీతి పాలన ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు

-భాజపా నేత అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ : అవినీతిని అంతమొందిస్తామన్న యూపీఏ మాటలు ఎవరూ పట్టించుకోరని భాజపా నేత అరుణ్‌జైట్లీ అన్నారు. యూపీఏ-2 నాలుగేళ్ల పాలనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రధాని హయాంలోనూ ఇంతటి అవినీతి పాలన జరగలేదని విమర్శించారు.