ఇందల్వాయి(జనం సాక్షి ) : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో దారుణం జరిగింది. స్థలం విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఎంపీపీ ఇమ్మడి గోపీ ఓ మహిళను కాలితో తన్నాడు.స్థలం రిజిస్ట్రేషన్ తర్వాత ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన గౌరారం వాసి రాజవ్వ చెబుతున్నారు. దీంతో ఆమె తమ బంధువులతో ఎంపీపీ ఇంటి ముందు నిరసనకు దిగింది. ఎంపీపీతో వారు వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో రాజవ్వ ఎంపీపీని చెప్పుతో కొట్టింది. దీంతో ఎంపీపీ మహిళను కాలితో తన్నాడు. అనంతరం బాధితురాలి బంధువులు ఎంపీపీని అక్కడి నుంచి తోసివేశారు. మహిళను ఎంపీపీ కాలితో తన్నిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి.