Thursday, 5 November 2026

ఇందిరమ్మ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది

ఇందిరమ్మ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నవంబర్ 19 (జనంసాక్షి): ఇందిరమ్మ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. అందరం సమిష్టి కృషితో ముందుకు వెళ్దాం అన్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబం ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ జూడో యాత్ర విజయవంతం అయిందన్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారన్నారు. లక్షల మంది తరలివచ్చారన్నారు. రాహుల్ గాంధీ జనాకర్షణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. యాత్ర దిగ్విజయంగా కొనసాగిందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. దళిత బంధు దళితుల్లో కూడా నిరుపేదలకు ఇవ్వాలన్నారు. ఇది గ్రామ సభల్లో అందరి సమక్షంలో పారదర్శకంగా జరగాలన్నారు. మండల స్థాయి అధికారులు దళిత బంద్ ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లకు లొంగకుండా పనిచేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర అధికారులు కూడా పనిచేయాలన్నారు. నిజమైన దళితులకు ఇవ్వకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే గుణపాఠం తప్పదు అన్నారు. భూ ప్రపంచంలో కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు జరిగే విషయాలపై సదస్సులో పాల్గొన్నానన్నారు. కాలుష్యం వాతావరణ మార్పుల వల్ల మానవజాతికే ముప్పు పొంచి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, అరుణ్ కుమార్ దేశ్ముఖ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.