Monday, 2 November 2026

ఇందువాసిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కేసు నమోదు

 

 

 

 

 

 

 

 

ఏప్రెల్ 29 (జనంసాక్షి )గట్టు మండల పరిధిలోని ఇందువాసి గ్రామానికి చెందిన బుడ్డ రామయ్య గాళ్ళ లక్ష్మన్న 45 సంవత్సరాలు పిడుగుపాటుకు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వివరాలు ఇలా ఉన్నాయి గట్టు ఎస్సై పవన్ కుమార్ కథనం మేరకు హిందువాసి గ్రామానికి చెందిన బుడ్డరామయ్యగాల లక్ష్మన్న రోజులాగే ఇంట్లో వాళ్లకి తనవ్యవసాయపోలానికి వెళ్తానని శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు గంటలకు పొలానికి వెళ్ళాడు రాత్రి కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన సమాధానం లేకపోవడంతో శనివారం ఉదయం పక్కన పొలం వారు ఆయన పొలంలోని ఉన్న గుడిసెలో మృతి చెందాడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు వాళ్లు జరిగిన సంఘటనలు చూసి అనుమానంతో ఎవరైనా చంపినారని గట్టు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు గట్టు పోలీస్ సిబ్బందితోపాటు గద్వాల సీఐ చంద్రశేఖర్ జరిగిన సంఘటన స్థలానికి పరిశీలించి పిడుగుపాటుతో చనిపోయినట్లు పోలీస్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు భార్య హనుమంతమ్మ ఫిర్యాదు మేరకు కేసునమెదు చెసి పోస్టుమార్టం కొరకు గద్వాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గట్టు ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలియజేశారు