జనంసాక్షి , కమాన్ పూర్ : పలు వైద్యశాలల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంథని నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ద్వారా సిఫార్సు చేసుకోగా
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గొల్లప్లలి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్ కి 46,500 రూపాయల చెక్కును, గాoడ్ల అఖిల కి 15,000 రూపాయల చెక్కు మంజూరు కాగా శనివారం గొల్లపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భుంపెళ్లి రాజయ్య , గ్రామ సర్పంచ్ సిలారాపు అనిత మల్లయ్య, జులపల్లి ఎంపిటిసి షెవ్వ శoకరయ్య, పెండ్యాల రాజు, చిగురి మొండయ్య,అడేపు రమేష్, నాగపూరి అజయ్, చిక్కుల్ల శ్రీనివాస్, మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.




