విజయవాడ,నవంబర్5(జనంసాక్షి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్చకులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు. ధన త్రయోదశిని పురస్కరించు కుని ఈ యాగాన్ని చేపట్టారు. ఉభయ దాతలు 75 మంది ఈ పూజలో పాల్గొన్నారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఈ యాగంలో పాల్గొన్నారు. దీంతో అమ్మవారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మరోవైపు ఈ నెల 9న అమ్మవారికి గాజుల అలంకరణ చేయనున్నారు. ఇందు కోసం భక్తుల నుంచి గాజుల సేకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించిన గాజులను పండితులు అమ్మవారికి అలంకరించనున్నారు. మరోవైపు ఇప్పటికే కోటి గాజుల సమర్పణ జరిగింది. దీంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు.




