Wednesday, 4 November 2026

ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం

కాంగ్రెస్‌తో పొత్తు వల్ల విపక్షాలది అనవసర రాద్దాంతం

వైకాపా,బిజెపిల విమర్శల తీరు దారుణం

మండిపడ్డ ఎపి మంత్రులు

అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): దేశభవిష్యత్తు కోసమే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో జతకట్టారని ఉపముఖ్య మంత్రి చినరాజప్ప పేర్కన్నారు. కాంగరెస్‌తో కలసి సరికొత్త రాజకీయాలకు తెరతీయడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో గుబులు రేగుతోందని మంత్రులు అన్నారు. ప్రధానంగా వైకాపా , పవన్‌ కళ్యాణ్‌, బిజెపిల తీరుపై మంత్రులు మండిపడ్డారు. భాజపాకు తగిన బుద్ధిచెప్పడానికే 16 ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయని సామర్లకోటలో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో అన్నారు. పీవీ హయాంలో దేశ సంక్షేమం కోసమే తెదేపా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్‌ కూడా పీవీ నరసింహారావుకు మద్దతు పలికారన్నారు. నంద్యాలలో పివి పోటీ చేసినప్పుడు కావాలనే ఆనాడు ఎన్టీఆర్‌ పోటీకి టిడిపి అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా టిడిపి కూడా మారాల్సి ఉంటుందన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ విషయమై చంద్రబాబు తుదినిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ముందుకొచ్చిందన్నారు. ప్రత్యేక ¬దాతోపాటు ఏదికావాలన్నా ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే కాంగ్రెస్‌తో కలిసినట్లు తెలిపారు. తాము పార్టీని కలపడంలేదని.. కేవలం పొత్తు మాత్రమే పెట్టుకొంటున్నామని చినరాజప్ప వెల్లడించారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి పవన్‌ సహకారం ఉందని…అంతేగానీ ఆయన వలనే గెలిచామనడం సరికాదని ¬ంమంత్రి చినరాజప్ప అన్నారు. పవన్‌ లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించామనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు సమంజసమే అని….పొత్తును తాను సమర్థిస్తున్నానన్నారు. బీజేపీ మోసం చేయడం వలనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని చినరాజప్ప స్పష్టం చేశారు. ఏపీకి కాంగ్రెస్‌ అన్యాయం చేసిందంటూ ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడెలా ఆ పార్టీతో కలుస్తారంటూ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేయడాన్ని ఎపి మంత్రులు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అధికారమే ముఖ్యమని, అందుకు ఎవరితోనైనా కలుస్తారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ, సోమిరెడ్డి

కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ, మోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే చంద్రబాబు అన్ని పార్టీలతో జట్టు కడుతున్నారని మంత్రి సోమిరెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో పెత్తనం చేస్తున్న మోడీ రాష్ట్రాలను, దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించారని అన్నారు. అందుకే తమ పార్టీ టిడిపి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలసి నాడవాలని నిర్ణయించిందన్నారు. ఇందులో ఎంతమాత్రం తప్పులేదన్నారు. దేశ అవసరాలతో పాటు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు మౌనంగా కూర్చోవడం సరికాన్న పంథాలో బాబు ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో కలిసి వెళ్తున్నామని మరోమంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరులో ఆయన విూడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పదవులు అనుభవించిన వారికి తెలుగువారి ఆత్మాభిమానం గుర్తుకు రాలేదా?…తాము కలిసినప్పుడే ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా? అని మండిపడ్డారు. మోదీ విభజన హావిూలు అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌పై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హావిూలపై మోదీని పవన్‌, జగన్‌ ఎందుకు నిలదీయడం లేదని మంత్రి ఆనంద్‌బాబు ప్రశ్నించారు. ఇదిలావుంటే బీజేపీకి బుద్ధి చెప్పేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు టీడీపీ భీమవరం పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ కనుమూరు రఘురామకృష్టంరాజు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నరసాపురం అన్ని పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ పోటీ చేస్తుందని, వదంతులు నమ్మొద్దని రఘురామకృష్టంరాజు పేర్కొన్నారు.