Wednesday, 4 November 2026

ఇంప్లిమెంటర్,మానిటర్ ల పాత్ర పై అవగాహన

 

 

 

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 19( జనం సాక్షి ): కోయగూడెం ఉపరితల గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలులో భాగంగా బుధవారం ఇంప్లిమెంటర్, మానిటర్ల పాత్ర పై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల రాజు డీజీఎం, సాట్ కార్పొరేట్ అధికారులకు, ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాను అమలుపై  విపులంగా వివరించారు. అదేవిధంగా సూపర్వైజర్లు, అధికారుల బాధ్యతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు కే ఓ సి మేనేజర్ సౌరబ్ సుమన్, రక్షణాధికారి కేఎస్ఎన్ రాజు, డిప్యూటీ మేనేజర్లు యు బ్రహ్మం, ఈ రవికుమార్, ఫిట్ సెక్రెటరీ ఆర్ అశోక్  తదితరులు పాల్గొన్నారు