టేకులపల్లి, ఏప్రిల్ 19( జనం సాక్షి): ఐకేపీ వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ఐకేపి వీఓఏ ఉద్యోగుల (సీఐటీయూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అరుణ,ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు అబ్ధుల్ నబిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐకేపీ వివోఏ ల నిరవధిక సమ్మె ను అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఐకేపీ వివోఏ లు వెట్టి చాకిరీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. సెర్ఫ్ ఉద్యోగులు గా గుర్తించాలి,కనీస వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలి,పది లక్షల రూపాయల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, సెర్ఫ్ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి నెలా వేతనాలు వ్యక్తి గత ఎకౌంటు లో వేయాలని, ఆన్లైన్ పనులు చేయించ వద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మూడ్ చరణ్, సహాయ కార్యదర్శి గౌసియా, అధ్యక్షురాలు చంద్రకళ,జయ, నాగమణి, స్వప్న, కావేరి తదితరులు పాల్గొన్నారు.




