Wednesday, 4 November 2026

ఐఎఫ్టియూ అధ్యక్షురాలుగా అపర్ణ

 

 

 

 

 

 

ఈ నెల 16,17,18 తేదీలలో తిరుపతి లో జరిగిన ఐఎఫ్టియూ 7 వ జాతీయ మహాసభల్లో యూనియన్ జాతీయ అధ్యక్షులుగా అపర్ణ ఎంపిక అయ్యారు! ప్రధాన కార్యదర్శి గా టి.శ్రీనివాస్,ఉపాధ్యక్షులు గా బి.ప్రదీప్, పటోలే,ప్రసాద్,పులివెందర్ సింగ్,సహాయ కార్యదర్శులుగా పొలారి,ఆశిష్,సృజన,కోశాధికారి గా హనుమేష్,కార్యవర్గ సభ్యులుగా ఆర్.జనార్దన్,అరుణ,వెంకటేశ్వర్లు,భారతి,వివిధ రాష్ట్రాల నుంచి మరో తొమ్మిది మందిని ఎంపిక చేసుకున్నట్లు ఐఎఫ్ టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ చెప్పారు! దేశంలో ప్రైవేటి కరణకు వ్యతిరేకంగా పోరాడాలని,మతోన్మాది పీఎం నరేంద్రమోడీ ప్రభుత్వం లో నిరుద్యోగం,అధికధరలు,అసమానతలు,పేదరికం పెరిగిందని అయన అన్నారు.కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం లేదన్నారు.అన్నీ విషయాల మీద మహాసభ చర్చించి సమరశీల పోరాటం చేయాలని,ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పలు తీర్మాణాలు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు!…………. జనం సాక్షి / ప్రత్యేక ప్రతినిధి