Wednesday, 4 November 2026

ఇచ్చిన హామీలను విస్మరించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

 

 

 

 

 

– జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎర్ర శేఖర్.ఊర్కొండ, ఫిబ్రవరి 8 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని విస్మరించినదని, పరిపాలన చేసే నైతిక హక్కు కోల్పోయిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎర్ర శేఖర్ విమర్శించారు.బుధవారం ఊర్కొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద, బలహీన, వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పరిపాలన చేస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా, కాల యాపన చేసిందని, అందులో భాగంగానే రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్స్, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా గాలిమాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు బీఆర్ఎస్(టిఆర్ఎస్) పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ అమలు చేస్తున్నారో చూయించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.