– తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దివిద్దాం.టిపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.
ఊరుకొండ, జనవరి 8 (జనంసాక్షి):ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చిన బడుగు బలహీన వర్గాల పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ అని టిపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. బుధవారం హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాహుల్ గాంధీసందేశ పత్రం గడప గడపకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రకు సంఘీభావంగా బుధవారం ప్రతి గడపగడపకు వారి సందేశాన్ని తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పార్టీకి పనిచేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద, బలహీన, వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని, అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది కానీ ప్రజలు కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఆరు నెలలపాటు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని, వారికి అండగా ఉంటామని ఏప్పుడు పిలిస్తే అప్పుడు ఏ గ్రామమైన రావడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. కార్యక్రమంలో మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, ఆలయం మాజీ చైర్మన్ నర్సిరెడ్డి, నాయకులు ఆయుబ్ పాషా, వహీద్, మనోహర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, అజహర్, శ్రీశైలం, షైబాజ్, ప్రవీణ్ రెడ్డి, రాజు, ఆది, మాసుం, షాకిర్, మధు తదితరులు పాల్గొన్నారు.




